బీర్లు తాగితే మతిమరుపు మాయం.. నిజమా..!

అనేక నేరాలకు మద్యం కారణం. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి విచక్షణ కోల్పోతాడు. మద్యం తాగడం వల్ల అనేక కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. అయితే కొన్ని పరిశోధనలు విస్మయానికి గురిచేస్తున్నారు. మనుషుల ఆలోచన పక్కదారి పట్టించేలా ఉంటున్నాయి. తాజాగా బీర్లు తాగితే మతిపరువు తగ్గుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైనట్లు చెబుతున్నారు. పరిశోధన ఎంత వరకు వాస్తవమో తెలియదు కానీ… దీంతో మందుబాబులు బీర్లను తెగ తాగేస్తున్నారు. ప్రతిరోజు ఓ పెగ్ మద్యం సేవిస్తే ఆరోగ్యానికి మంచిదనే భావన కూడా అందరిలో ఉంది. ఇలాంటి సమయంలో బీర్లు తాగడం వల్ల మతిమరపు తగ్గుందని చెప్పడంతో మందుబాబులు ఇక ఊరకుంటారా. వయసు పెరిగే కొద్ది అల్జీమర్స్ వ్యాధితో బాధపతుంటారు. ఇలాంటి వారు బీరు తాగాల్సిందేనని ఈ పరిశోధన సందేశం. ఈ పరిశోధన ఏమో కానీ పరోక్షంగా బీర్లు తాగేందుకు ఉసిగొల్పుతున్నాయనడంలో సందేహం లేదు.

వయసు పైబడుతున్న కొద్దీ మతిమరుపు సహజమే. నాడీ వ్యవస్థలో అమైలాయిడ్ బీటా, ప్రొటీన్ల నిల్వలు ఎక్కువైతే మతిమరుపు వస్తుంది. దీనికి బీర్లలో వాడే హాప్ అనే పదార్థంతో అల్జీమర్స్ వ్యాధి రాకుండా నిరోధిస్తుందని చెబుతున్నారు. ఈ హాప్ లు హ్యుములస్ లుపులస్ అనే మొక్క పూలు వల్ల మతిమరుపును నిరోధించవచ్చు. ఈ పూల ద్వారా వచ్చే మిశ్రమాన్ని బీర్ల తయారిలో వాడుతారని చెబుతున్నారు. మతిమరుపుకు చెక్ పెట్టొచ్చట. జనభాలో అత్యధిక శాతం మందుప్రియులే ఉన్నారు. వీరంతా సాయంత్రం అయితే చాలు తెగ తాగేస్తూ ఉంటారు. తాగడానికి ఏవో కారణాలు వెకుతూ తాగుతుంటారు. శుభకార్యమైన.. అశుభకారమైన మందు తాగడం తప్పని సరిగా ఉంటుంది. ఈ బలహీనతే మద్యం వ్యాపారులకు వరంగా మారింది. దేశంలో విచ్చలవిడిగా మందు అమ్ముడవుతోంది. ప్రభుత్వాలకు అత్యధికంగా ఆదాయం తెచ్చిపెడుతోంది.

Leave a Reply

Your email address will not be published.