టమాటాలతో ఈ రోగాలకు చెక్..

మనం ప్రతిరోజు టమాలను ఆహారంలో తీసుకుంటూ ఉంటాం. ఏ వంటలోనైనా టమాట తప్పనిసరి. టమోటా ధర ఎంత అయినా సరే కొనాల్సిందే. మనం రోజు టమోటాను ఏదో రూపంలో తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని అంటున్నారు. టమాటాల్లో పోషక విలువలు ఎక్కువ. ఇందులో ఉండే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు తగ్గేందుకు సహాయపడుతాయి. టమాటాల్లో ఉండే లుటిన్, లైకోపీస్ వంటి కెరోటినాయిడ్లు కంటికి సమస్యలు రాకుండా నిరోధిస్తాయి. అలాగే గుండె సంబంధిత రోగాలకు టమాటాలు తగ్గిస్తాయి. టమాటాల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అధిక మోతాదులో బీటా కెరోటిన్ ఉండటం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా నిరోధిస్తుంది. టమాటాల్లో ఉండే లైకోపీస్ పుష్కలంగా ఉండటంతో క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా చేస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి.

పోలేట్ తో మోసిస్టీన్ స్థాయిలను నియంత్రించడంతో గుండె పోటు సమస్యలు రాకుండా అడ్డుకుంటుందని నిపుణులు అంటున్నారు. టమాటాల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. అందువల్ల కూరల్లో టమాటాను చేర్చుకుంటారు. ఆరోగ్యానికి కూడా మంచి ఉపయోగకారిగా ఉంటుంది. అందుకే టమాటాలను విరివిగా వాడతారు. ఈ నేపథ్యంలో టమాటాలతో ఏ వంటకం చేసుకున్నా దాని రుచే వేరు. టమాటాలతో పలు రకాల వ్యాధులు కూడా దూరం అవుతాయి. టమాటాల వాడకంతో పలు రకాల రోగాల నుంచి ఉపశమనం పొందవచ్చు. టమాటాలను తీసుకుని వంటల్లో ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.