ఉప్పు భూమిమీద జంతువులన్నింటి మనుగడకు కావలసిన లవణము. ఇది షడ్రుచులలో ఒకటి. ఉప్పులో అత్యధిక శాతం ఉండే రసాయనము సోడియం క్లోరైడ్. ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని ఇస్తుంది. ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఒక ప్రధాన పాత్ర. ఏ వంటకం అయినా అందులో ఉప్పు తగినంత లేకుంటే రుచే ఉండదు. ప్రతి వంటకంలో ఉప్పు కీలక పాత్ర పోషిస్తుంది. అట్లని ఉప్పును అధికంగా తీసుకుంటే ప్రమాదమే. ఉప్పులో ఉండే సోడియం అనారోగ్యకరమైనదని అందరికీ తెలుసు. శరీరంలో సోడియం శాతం పెరిగితే రక్తపోటు (హైబీపీ) స్థాయి పెరుగుతుంది. రక్తపోటు హెచ్చుతగ్గుల వల్ల అనేక ప్రమాదాలు అనేక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి వ్యక్తి రోజుకు 5గ్రాముల కంటే తక్కువ ఉప్పును తీసుకోవాలని చెపుతుంది. ఉప్పు, సోడియం, క్లోరైడ్, ఖనిజాలు శరీరానికి సహాయపడుతాయి. అలాగే ఉప్పు.
నీటి స్థాయిలను నియంత్రించడంతో పాటు శరీరంలోని ఎలక్ట్రోలైట్‌ను సమతుల్యం చేయడంలోనూ కీలకంగా వ్యవహరిస్తుంది. అంతేకాదు జీర్ణక్రియను మెరుగు పర్చడంతో పాటు శరీరాన్ని శుభ్రపరుస్తుంది. లాలాజలాన్ని ప్రేరేపిస్తుంది. నాడీ వ్యవస్థ మెరుగుపడటంలోనూ ఉప్పు పాత్ర ఉంది. సరైన మొత్తంలో ఉప్పు మన శరీర మొత్తాన్ని తేమగా ఉంచడంలో సహకరిస్తుంది. హిమాలయన్ ఉప్పు, రాతి ఉప్పు, సముద్రపు ఉప్పు, నల్ల ఉప్పు, ఇతర లవణాలను వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. రోజుకు ప్రతి ఒక్కరూ 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పును తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రతీరోజు సగటున ఒక భారతీయుడు 30 గ్రాముల ఉప్పు వాడుతున్నాడు. ఇది జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సు కన్నా చాలా ఎక్కువ. రోజుకు ఆరు గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు తీసుకూడదని సంస్థ సూచిస్తోంది. ఉప్పు ఎక్కువ తీసుకుంటే గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు, కడుపులో క్యాన్సర్, ఆస్టియోపోరొసిస్ కలుగుతాయి.
సముద్రం నుంచి లభించే ఉప్పులో 40 శాతం సోడియం, 60 శాతం క్లోరైడ్ ఉంటాయి. మన శరీరంలో ఉప్పుమీద ఆధారపడని అవయవమంటూ ఏమీలేదంటే అతిశయోక్తి కాదు. మన శరీరంలో జరిగే రసాయనిక చర్యలు అన్నీ కూడా ఉప్పు మీదే ఆధారపడి ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో ఉప్పు ముఖ్యమైన పదార్థం. కండరాలు సంకోచించడంలో, నీటి నిల్వ ఉండటంలో కీలక పాత్ర వహిస్తుంది. అంతేకాక శరీరంలో జీర్ణవ్యవస్థకు అవసరమైన పోషకాలు ఉప్పులో ఉన్నాయి. శరీరంలో సోడియం తక్కువైతే డీహైడ్రేషన్ కలుగుతుంది. మరోవైపు సోడియం ఎక్కువ ఉండే ఉప్పు పదార్థాలు తీసుకుంటే అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. ఇక్కడో సందేహం కలుగుతుంది. మన శరీరానికి ఎంత ఉప్పు అవసరం? జాతీయ పోషకాహారం సంస్థ ప్రకారం ఒక వ్యక్తి రోజుకు ఆరు గ్రాములు మాత్రమే ఉప్పు తీసుకోవాలి. కానీ సగటున ఒక వ్యక్తి రోజులో 8 నుంచి 12 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాడు. ఉప్పు మన శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది. శరీరంలోని ఆమ్ల క్షార నిష్పత్తిని క్రమబద్దీకరించే చర్యలో సోడియం ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. సోడియం శాతం పడిపోతే హార్మోనులు పంపే సంకేతాలు శరీరంలో సరిగా వ్యాప్తికావు. కండరాలు నీరసించి మనిషి తేలికగా అలసటకూ చికాకుకూ లోనవుతాడు.