తొలి టీ20: టీమిండియా టార్గెట్…

తిరువనంతపురం: గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 106 పరుగులు చేసింది. భారత్ బౌల్లర్ల ధాటికి ప్రత్యర్థి బ్యాటింగ్ పేవిలియన్ క్యూకట్టారు. దీంతో 9 పరుగులకే సౌతాఫ్రికా 5 కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో కురుకుపోయింది. అర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, దీపక్ చహర్ 2 వికెట్లతో దక్షిణాఫ్రికాను దెబ్బతీశారు. తొలి ఓవర్ లోనే కెప్టెన్ టెంబా బవువాను చాహర్ ఔట్ చేసి శ్రీకారం చుట్టాడు. తర్వాత ఓవర్ వేసిన అర్షదీప్ కూడా రెచ్చిపోయి మూడు వికెట్లు తీసి సఫారిల నడ్డివిడిచారు.

అయితే పర్యాటక జట్టు గౌరవప్రదమైన స్కోరు నమోదు చేయడంలో మార్‌క్రమ్ (25), పార్నెల్ (24), కేశవ్ మహారాజ్ (41) కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా కేశవ్ మహరాజ్ అద్భుతంగా రాణించాడు. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంలో కీలకపాత్ర పోషించి జట్టు పరువు నిలబెట్టాడు.

Leave a Reply

Your email address will not be published.