హుజురాబాద్ లో వైఎస్ షర్మిల దీక్ష..
ఆర్.బి.ఎం డెస్క్: తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపడుతున్న విషయం విదితమే. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికెషన్స్ రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై షబీర్ అనే యువకుడు రైలు క్రింద పడి ఆత్మ హత్య చేసుకున్నాడు.ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హుజురాబాద్ నియోజకవర్గం లోని ఇల్లంతుకుంట మండలం సిరిసేడు గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేయనున్నారు. షర్మిల ముందుగా ఆత్మ హత్య చేసుకున్న షబీర్ కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం దీక్ష శిబిరానికి చేరుకొని షర్మిల దీక్ష చేయనున్నారు.
హుజురాబాద్ లో ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే అధికార ప్రతి పక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారంలో నిమగ్నమైయ్యాయి. ఈ క్రమంలో హుజురాబాద్ నియోజకవర్గంలో షర్మిల దీక్ష రాజకీయవర్గాల్లో చర్చనీయా అంశంగా మారింది.