సికింద్రాబాద్లోని పలు ఆలయాలను సందర్శించిన ఉప సభాపతి పద్మారావు గౌడ్

సికింద్రాబాద్లోని పలు ఆలయాలను సందర్శించిన ఉప సభాపతి పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం, డెస్క్, సికింద్రాబాద్ : బోనాలు వేడుకలను తెలంగాణ ప్రజలు సంప్రదాయ బద్దంగా నిర్వహించుకొనే లా ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తోందని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. ఆదివారం బోనాలు వేడుకలను పురస్కరించుకొని జంట నగరాలలోని పలు ఆలయాలను పద్మారావు గౌడ్ సందర్శించారు. చారిత్రాత్మక కంటోన్మెంటు బలంరాయి దండు మారెమ్మ దేవాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ పక్షాన పట్టు వస్త్రాలు పద్మారావు గౌడ్ అమ్మరివారికి సమర్పించారు. అనంతరరం పద్మారావు గౌడ్ సితఫలమండీ పోచమ్మ, ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యెక పూజలు నిర్వహించారు. తార్నాక లోని ముత్యాలమ్మ ఆలయంలో పూజల్లో ప్రత్యేక్య పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సుఖశాంతులకు ప్రార్ధించి నట్లు పద్మారావు గౌడ్ తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా తగ్గలేదని ప్రజలు తగు జాగ్రత్త తీసుకోవాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఇతర నాయకులు దండు మారెమ్మ దేవాలయం వద్ద కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.