రతన్ టాటాను భారత దేశ రాష్ట్రపతిని చేయాలి: మెగా బ్రదర్ నాగబాబు

రతన్ టాటాను భారత దేశ రాష్ట్రపతిని చేయాలి: మెగా బ్రదర్ నాగబాబు

ఆర్.బి.ఎం డెస్క్ :మెగా బ్రదర్ నాగబాబు సామజిక మాధ్యమంలో యాక్టీవ్గా ఉంటూ ఆయనను అభిమానులు అడిగే ప్రశ్నలకు తదైనా శాలిలో సమాదానాలు ఇస్తుంటారు నాగబాబు. సోషల్ మీడియా వేదికగా ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు నాగబాబు. తాజాగా నాగబాబు చేసిన ఒక ట్విట్ ఇప్పుడు నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది. కరోనా మహమ్మారితో దేశం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని ప్రేమించే నాయకుల అవసరం ఎంతైనా ఉందని అయన చెప్పుకొచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రాజకీయనాయకులు రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయాలనీ అయన పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితులో రాజకీయ ఎత్తుగడులను వ్యూహాలను రచించే నాయకుల కన్నా దేశాన్ని ప్రేమించే నాయకుడు తదుపరి రాష్ట్రపతిగా కావాలని నాగబాబు అన్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు తదుపరి దేశ రాష్ట్రపతిగా రతన్ టాటా పేరు ను ప్రతిపాదించారు. తదుపరి భారతదేశ రాష్ట్రపతి ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించి ప్రేమించే వ్యక్తి అయితే బాగుంటుందని దానికి మీరేం అంటారు అని నాగబాబు తన ట్విట్టర్ వేదిక ద్వారా ప్రజలను ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published.