కాంగ్రెస్ గూటికి తుమ్మల నాగేశ్వరరావు..?

కాంగ్రెస్ గూటికి తుమ్మల నాగేశ్వరరావు..?

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: టిఆర్ఎస్ ప్రభుత్వం రెండవసారి ఏర్పాటైన తర్వాత పార్టీలో కీలక నాయకులకు సముచిత స్థానం ఇవ్వకపోవడం తగిన గుర్తింపు రాకపోవడంతో వారంతా అసంతృప్తితో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టిఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఒక వెలుగు వెలిగిన నాయకులు ప్రస్తుతం జిల్లా స్థాయిలో కూడా తమ హవా చూపెట్టలేకపోవడంతో వారంతా రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఓటమి ఎంత సీనియర్ నాయకులనైనా సైలెంట్గా చేస్తుందంటూ అలాంటి నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఉన్నారంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాంటి నాయకుల్లో ప్రముఖంగా తుమ్మల నాగేశ్వర రావు పేరు బాగా వినిపిస్తోంది.

ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల ప్రభావం అత్యధికంగా ఉన్న కూడా తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ మేధస్సుతో టిడిపి తరఫున మూడు సార్లు ఎమ్మెల్యేగా అక్కడి నుండి ఎన్నికయ్యారు. ఎన్టీరామారావు హయాంలో తుమ్మల నాగేశ్వరరావు మంత్రివర్గంలో పనిచేశారు.ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా నాగేశ్వర రావు మంత్రి పదవిలో కొనసాగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు టిడిపి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుని ప్రభుత్వంలో మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ముందస్తుగా వచ్చిన ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలవడంతో పార్టీలో తనకు సముచిత స్థానం దక్కడం లేదని భావిస్తున్నారని వార్తలు చాలా వచ్చాయి. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యామ్నాయ పార్టీ కోసం ఎదురు చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్ సమయంలోనే తుమ్మల బిజెపిలో చేరుతారని వార్తలు అప్పట్లో చాలా వచ్చాయి ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీ హామీ ఇవ్వడంతో ఆయన వెనకడుగు వేశారని ప్రచారం జోరుగా సాగింది. రేవంత్ రెడ్డి టి పి సి సి బాధ్యతలు చేపట్టిన క్షణం నుండి కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారని టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

గత కొద్దికాలంగా తుమ్మల నాగేశ్వరరావు టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలలో కనిపించడం లేదు ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో తుమ్మల నాగేశ్వర రావును కాంగ్రెస్ గూటికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఖమ్మం జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది.గతంలో రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వర రావు టిడిపి పార్టీలో పని చేశారు ఆ అనుబంధంతోనే రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వర రావునో కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తారని,అంతేకాకుండా ఖమ్మంలోని మిగతా కీలక నాయకులతో కూడా రేవంత్ రెడ్డి మంతనాలు జరుపుతున్నట్లుగా సమాచారం.

Leave a Reply

Your email address will not be published.