షర్మిల అనుచరుడు మృతి.. తీవ్ర విషాదంలో షర్మిల..!

షర్మిల అనుచరుడు మృతి.. తీవ్ర విషాదంలో షర్మిల..!

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: వైఎస్ షర్మిల అనుచరుడు బాలకృష్ణ రెడ్డి కరొనతో పోరాడి చివరకు ప్రాణాలు కోల్పోయారు. వైఎస్ షర్మిల కొత్త పార్టీ ప్రస్థానం మొదలు పెట్టిన నుండి బాలకృష్ణ రెడ్డి చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఎల్బీ నగర్‌లోని గుర్రంగూడలో నివసిస్తున్న బాలకృష్ణ రెడ్డి మరణం పట్ల పార్టీ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. బాలకృష్ణ మరణం తమ పార్టీకి తీరని లోటని వైఎస్ షర్మిల ప్రధాన అనుచరుడు పిట్టా రాంరెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. బాలకృష్ణ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ తక్షణ ఆర్థిక సాయంగా వారి కుటుంబానికి వైఎస్ షర్మిల రూ.1లక్ష అందించనున్నట్లు షర్మిల ప్రధాన అనుచరుడు పిట్టా రాంరెడ్డి పేర్కొన్నారు.

వైఎస్ షర్మిల మరో అనుచరుడు భారత్ రెడ్డి కరోనా సోకి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కాగా వరంగల్ జిల్లాకు చెందిన మరో నాయకుడు నాడెం శాంతకుమార్ తోపాటు అప్పం కిషన్ కూడా కరోనా సోకినట్టు వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.