కరోనా పాజిటివ్..ఐసోలేషన్‌లో మంత్రి కేటీఆర్..

కరోనా పాజిటివ్..ఐసోలేషన్‌లో మంత్రి కేటీఆర్..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: గత కొద్దీ రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం కెసిఆర్ ఎర్రవల్లిలో తన ఫామ్ హౌస్ లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కెసిఆర్ దగ్గర ఉంటూ అయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో పలు టెస్టుల నిమ్మితం కెసిఆర్ ఆస్పత్రికి వెళ్ళినప్పుడు కేటీఆర్ కూడా అయన వెంటే ఉన్నారు.. ఈ క్రమంలో కేటీఆర్ కు కూడా కరోనా సోకినట్టు తెలుస్తోంది. తాజాగా స్వల్ప లక్షణాలు కనిపించడంతో కేటీఆర్ కరోనా టెస్టు చేయించుకున్నారు. కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. కాగా అతి స్వల్ప లక్షణాలు ఉన్నటు వైద్యులు పేర్కొన్నారు. స్వయంగా తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం కేటీఆర్ తన వ్యక్తిగత ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇప్పటి వరకు తనతో సన్నిహితంగా ఉన్న వారంతా టెస్టులు చేయించుకోవాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయన కోరారు. ఈ నేపథ్యంలో ఐసోలేషన్‌లోకి వెళుతున్నట్టు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.