గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకునే వారు అనుమతుల కోసం ఇక్కడ నమోదు చేసుకోవాలి..

గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకునే వారు అనుమతుల కోసం ఇక్కడ నమోదు చేసుకోవాలి..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా జరుపుకునే వినాయక చవితి ఈ నెల 10 వ తేదీన ఉండటంతో చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరు వారి వారి స్థోమతను బట్టి ఇండ్లలో,బస్తీలలో, కానీలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటారు. భక్తి శ్రద్దలతో వినాయకుడికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. వినాయక చవితి అనగానే ముందుగా అందరికి గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ భారీ వినాయకుడు. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడనికి హైదరాబాద్ నగర భక్తులతో పాటు పక్క రాష్ట్రాలను నుండి కూడా భక్తులు వస్తుంటారు.

ఈ నేపథ్యంలో పోలీసులు గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులందరు తప్పనిసరిగా ఆన్ లైన్లో పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. వినాయక విగ్రహాల ఏర్పాటు అనుమతుల కోసం మీ సమీప పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదంటూ నిర్వాహకులు ఆన్ లైన్లో నమోదు చేసుకుంటే పోలీసులే స్వయంగా వినాయక మండపాల వద్దకు వచ్చి మీరు ఆన్లైన్ లో పెట్టిన సమాచారం మేరకు పోలీస్ సిబ్బంది సంప్రదిస్తారని పేర్కొన్నారు.

నిర్వాహకులు అందరూ ఆన్లైన్ లో నమోదు చేసుకుంటేనే పాలనా యంత్రాంగం తగు ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. కాబ్బటి కౌన్సిలర్స్,సర్పంచులు, కాలనీ మరియు గ్రామ పెద్దలు, యువజన సంఘాలు, అన్ని రాజకయపార్టీల నాయకులు, అందరూ ఈ సమాచారం గణేష్ మండప నిర్వాకులకు చెరవేసి అందరూ కూడా ఆన్లైన్ లో వారి విగ్రహ ఏర్పాటుకు సమాచారం నమోదు చేసుకోవాలని ఈ సందర్బంగా పోలీసులు వెల్లడించారు.

వినాయక మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published.