అంబేద్కర్ విగ్రహాన్ని వెంటనే పంజాగుట్ట వద్ద ఏర్పాటు చేయాలి: వి.హనుమంత్ రావు, కాంగ్రెస్ నేత

అంబేద్కర్ విగ్రహాన్ని వెంటనే పంజాగుట్ట వద్ద ఏర్పాటు చేయాలి: వి.హనుమంత్ రావు, కాంగ్రెస్ నేత

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంత్ రావు శనివారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆయన అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహేబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్ట వద్ద వెంటనే ఏర్పాటు చేయాలని వి.హనుమంత్ రావు ప్రభుత్వాని డిమాండ్ చేశారు. గత మూడు సంవత్సరాలుగా ఈ విషయంపై పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుందని వి.ఎచ్ మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో దళితుల కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాని తాము స్వాగతిస్తున్నామని కానీ ఆ పథకం ఒక్క హుజురాబాద్ కె పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు ను అమలు చేయాలనీ వి.ఎచ్ అన్నారు. దళిత బంధు లాగా బీసీ బంధు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనీ బీసీలు కూడా చాల వెనుకబడి ఉన్నారని వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టుకొని బీసీ బంధు ప్రవేశపెట్టాలని వి.హనుమంత్ రావు కోరారు.

Leave a Reply

Your email address will not be published.