వికారాబాద్ లో పేకాట ఆడుతున్న 42 మంది అరెస్ట్..

rbm

వికారాబాద్ లో పేకాట ఆడుతున్న 42 మంది అరెస్ట్..

ఆర్.బి.ఎం వికారాబాద్: వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడు ప్రదేశాల్లో పేకాట ఆడుతున్న 42 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ కేంద్రంలోని మూడు ప్రదేశాల్లో పేకాట ఆడుతున్నారనే పక్క సమాచారంతో పేకాట స్థావరాలపై దాడులు చేశామని అయన అన్నారు. కాగా పేకాట రాయుళ్ల వద్ద నుండి పది ద్విచక్ర వాహనాలు, 29 సెల్ ఫోన్లు, 187989 రూపాలు స్వాధీనం చేసుకున్నామని, 42 మంది పేకాటరాయుళ్లపై కేసు నమోదు చేశామని వికారాబాద్ సీఐ రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.