చీకటి పై వెలుగు, చెడు పై మంచికి ప్రతీక దీపావళి: డాక్టర్ మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే

చీకటి పై వెలుగు, చెడు పై మంచికి ప్రతీక దీపావళి: డాక్టర్ మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే

ఆర్.బి.ఎం వికారాబాద్: దీపావళి పండుగ సందర్భంగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ నిన్న రాత్రి వికారాబాద్ పట్టణంలోని వివిధ వ్యాపార దుకాణాలలో ఏర్పాటు చేసిన లక్ష్మి పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దీపావళి అంటే చీకటిపై వెలుగు, చెడుపై మంచి, నిరాశపై ఆశ యొక్క విజయాన్ని సూచించే పండుగ అన్నారు. మనమందరం ఇళ్లలో, దుకాణాలలో దీపాలు, కొవ్వొత్తులను వెలిగించి, సంపద, అదృష్టం, శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తామన్నారు. వికారాబాద్ నియోజవర్గ ప్రజలు ఆయురారోగ్యాలు, సిరి సంపదలు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published.