రాజకీయ జీవిత ప్రధాతకు రుణపడి ఉంటా: డాక్టర్ మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే

trs vikarabad mla methu anand

రాజకీయ జీవిత ప్రధాతకు రుణపడి ఉంటా: డాక్టర్ మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే

ఆర్.బి.ఎం వికారాబాద్: ప్రగతి భవన్ లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డితో కలిసి వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు వికారాబాద్ ఎమ్మెల్యే ‘డాక్టర్ మెతుకు ఆనంద్’ టిఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ‘కేసీఆర్’ని మర్యాదపూర్వకంగా కలిసి, మొక్కతో కృతజ్ఞతలు తెలియజెశారు.

ఈ సందర్భంగా వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ… జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజెస్తున్న అని అన్నారు. తనను నమ్మి వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా నియమించినందుకు గానూ వికారాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.