పరిగిలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా..

parigi corona cases

పరిగిలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా..

ఆర్.బి.ఎం పరిగి: వికారాబాద్ జిల్లాలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఈరోజు (గురువారం) పరిగి మండల పరిధిలో 24 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పరిగి మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, చిట్యాల ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సుమారు 70 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా అందులో 24 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కరోనా పట్ల జాగ్రత్తలు పాటించాలని బహిరంగ ప్రదేశాల్లో సామజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించాలని కరోనా పట్ల నిర్లక్ష్యం వహించకూడదని వారు సూచించారు.

Leave a Reply

Your email address will not be published.