శానిటేషన్ సిబ్బంది సేవలు కీలకం: డాక్టర్ మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే

శానిటేషన్ సిబ్బంది సేవలు కీలకం: డాక్టర్ మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే

ఆర్.బి.ఎం వికారాబాద్: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి దుస్తులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శానిటేషన్ సిబ్బంది సేవలు కీలకం అన్నారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో శానిటేషన్ సిబ్బంది తమ విధులను అంకిత భావంతో పనిచేయటం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సపాయన్న నీకు సలాం అంటు కార్మికుల సేవలను గుర్తించి ప్రతీ సంవత్సరం నిత్యవసర వస్తువులు భద్రతాయుతమైన వస్తువులను ప్రభుత్వం అందిస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్, వైస్ చైర్ పర్సన్ శంషాద్ భేగం, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మునిసిపల్ కమీషనర్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.