శుభ్రమైన మిషన్ భగీరథ నీటినే త్రాగుదాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

శుభ్రమైన మిషన్ భగీరథ నీటినే త్రాగుదాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

ఆర్.బి.ఎం వికారాబాద్: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని ద్యాచారం గ్రామంలో సాయంత్రం 5:40 PM నుండి 7:30 PM వరకు పర్యటించారు. మిషన్ భగీరథ నీరు శుభ్రపరిచిన తరువాతే గ్రామాల్లోకి వస్తున్నాయని, ఎలాంటి అపోహాలు లేకుండా మిషన్ భగీరథ నీటిని త్రాగాలన్నారు.

గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని అలాగే రోడ్డు మధ్యలో ఉన్న స్థంబాన్ని మరియు నిరుపయోగంగా ఉన్న పాత స్తంభాలను తొలగించాలన్నారు. పంట పొలాకు వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉన్న పార్మిషన్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.

ప్రాథమిక పాఠశాలలో సరిపడ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలన్నారు మరియు గ్రామంలో అందరి విన్నపం మేరకు సాయంత్ర సమయంలో ట్యూషన్ ఏర్పాటుకు కోసం సాకారం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.