ఘనంగా అంతర్జాతీయ మహిళల హింస నిర్మూలన కార్యక్రమం..

ఈరోజు నిజామాబాద్ జిల్లాలో అంతర్జాతీయ మహిళల హింస నిర్మూలన దినోత్సవాన్ని సఖి సొసైటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలకు నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్నటువంటి హింసాత్మకమైన కార్యక్రమాల గురించి ,వాటిని ఎదుర్కోవడానికి వారిలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఉండడానికి పలువురు వారికి అవగాహన కల్పించారు. మహిళలకు ఇంటి పరంగా గాని ,బయట కానీ ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు సఖి కేంద్రం వారికి ఏ రకంగా సహాయపడగలదో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కొందరు మహిళలు వారివారి విభాగాల్లో రాణిస్తున్న టువంటి ప్రత్యేక మహిళలకు సన్మానం చేయడం జరిగింది. ఈ క్రమానికి అడిషనల్ డిఎస్పి ఉషా విశ్వనాథ్ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వారిని ఘనంగా సన్మానించడం జరిగింది వారితో పాటుగా వైద్యశాఖ సూపర్డెంట్ శ్రీమతి ప్రతి మహారాజ గారిని, DWO ఝాన్సీ లక్ష్మి గారిని, విద్యా శాఖ నుండి GCDO శ్రీమతి వనిత గారిని, CWC member శ్రీమతి సంపూర్ణ గారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు మరియు CDPO లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.