నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు శాపాలుగా మారాయి : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్..

నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు శాపాలుగా మారాయి : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్..

ఆర్.బి.ఎం వికారాబాద్: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెరాస పార్టీ అధ్యక్షులు గౌరవ కెసిఆర్ గారి పిలుపుమేరకు వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ చౌరస్తా లో ధర్నా కార్యక్రమం చేపట్టారు.

FCI (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నిల్వలు పేరుకుపోయాయి అంటూ ఒక పక్క బయిల్డ్ రైస్ ను కొనమని కేంద్రం లేఖ పంపిస్తే, రాష్ట్ర బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పంజాబ్ లో వరి ధాన్యాన్ని ఎలా కొంటారు, తెలంగాణాలో వరి ధాన్యాన్ని ఎందుకు కొనరని అడిగారు మరియు తెలంగాణ రాష్ట్రము పైన బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతూ రైతులతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు శాపాలుగా మారి రైతంగాన్ని క్షోభకు చేస్తుందన్నారు. వ్యవసాయ రంగాన్ని తద్వారా కార్పొరేట్ల చేతుల్లో పెట్టేందుకు తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలన్నారు. రైతుల సంక్షేమం కోసం బొట్టు బొట్టు నీటిని ఒడిసి పట్టుకొని కరెంటు సామర్థ్యాన్ని పెంచి అద్భుతమైన రీతిలో నీటిని అందిస్తూ, పంటలు పండిస్తూ తెలంగాణను అన్నపూర్ణగా మారుస్తున్న ఘనత కెసిఆర్ కె దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published.