13 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్..

13 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్..

ఆర్.బి.ఎం అనంతసాగర్: పేకాట ఆడుతున్న 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతసాగర్ గ్రామ శివారులో గురువారం సాయంత్రం పేకాట ఆడుతున్న పదమూడు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎస్సై సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం పేకాటరాయుళ్ల వద్ద నుండి ఒక ఆటో, మూడు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరితోపాటు పేకాట ఆడిన మరో ఏడుగురు పరారీలో ఉన్నారని అన్నారు. ఈ పదమూడు మంది వ్యక్తులపై కేసు నమోదు చేశామని ఎస్సై సంతోష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.