కార్యకర్తల కుటుంబాలకు అండగా గులాబీ జెండా : మెతుకు ఆనంద్ వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్

కార్యకర్తల కుటుంబాలకు అండగా గులాబీ జెండా : మెతుకు ఆనంద్ వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్

ఆర్.బి.ఎం వికారాబాద్: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని రాంపూర్ తాండలో ప్రమాదవశాత్తు మరణించిన తెరాస పార్టీ కార్యకర్త కుటుంబానికి Rs.2,00,000/- (రూపాయలు రెండులక్షలు) ప్రమాద భీమా చెక్కును అందజేశారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలు ఆదరువును కోల్పోయి ఇబ్బందులు పడరాదని ముఖ్యమంత్రి పార్టీ అధినేత గౌరవ కేసీఆర్‌ అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని, అందుకు భరోసాగా కార్యకర్తలకు ప్రమాద భీమా ఏర్పాటు చేశారన్నారు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నుండి అధ్యక్షుల వరకు ప్రతి విషయములో కార్యకర్తల సంక్షేమం కొరకు పాటుపడుతున్న పార్టీ తెరాస అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.