అధికారుల నిర్లక్ష్యం.. రోడ్డు మధ్యలో స్థంభం..

అధికారుల నిర్లక్ష్యం.. రోడ్డు మధ్యలో స్థంభం..

ఆర్.బి.ఎం వికారాబాద్: అధికారుల నిర్లక్షానికి ప్రజలు నిత్యం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా నుండి చిన్న గేటు వరకు గత కొన్ని నెల క్రితం రోడ్డు పనులు మొదలయ్యాయి. నెలలు గడిచిన రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో వాహనదారులకు అటు వైపు వెళ్ళడానికి తలనొప్పిగా మారింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే రోడ్డు పనులు ఆలస్యం అవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా రోడ్డు వెడల్పు చేయడంతో రోడ్డు మధ్యలోకి కరెంట్ స్థంభం వచ్చిన దాని మధ్యలో నుండి తొలగించకపోవడం పట్ల స్థానికులు నిరాశ వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా కలుగచేసుకొని రోడ్డు పనులను తొందరగా పూర్తిచేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published.