భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యోగి
ఆర్.బి.ఎం హైదరాబాద్: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యోగితో పాటు తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఆదిత్యనాథ్‌కు ఆలయ కమిటీ భాగ్యలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించింది. సీఎం పర్యటన నేపథ్యంలో చార్మినార్ పరిసరాల్లో పోలీసులు నిఘా పెట్టారు. భాగ్యలక్ష్మి ఆలయ పరిసరాల్లో 500 మీటర్ల రేడియస్‌లో మూడు వలయాలతో భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం 350మంది పోలీస్‌లతో భద్రతను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఆధిత్యనాథ్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు.