కురుక్షేత్రలోని శ్రీవారిని దర్శించుకున్న టీటీడీ బోర్డ్ మెంబర్ జనార్దన్‌రెడ్డి
ఆర్.బి.ఎం: రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత, చేవెళ్ల పార్లిమెంట్ బీజేపీ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డిని టీటీడీ బోర్టు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. టీటీడీ బోర్డు మెంబర్ గా మొదటిసారి నియామకం అయిన జనార్దన్ రెడ్డి హర్యానాలోని కురుక్షేత్ర వెంకటేశ్వర స్వామి ఆలయంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి వెంకటేశ్వర్ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ బోర్డు మెంబర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామికి సేవ చేసే అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. టీటీడీ బోర్డు మెంబర్ (ప్రత్యేక ఆహ్వానితులు) గా శ్రీవారికి సేవ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. హర్యానా క్రీడా మంత్రి, కురుక్షేత్ర ఎంపీ,ఎమ్మెల్యే ఇతరాలు నాయకులు పాల్గొన్నారు.