పోలీసుల ఎదుట లొంగిపోనున్న మావోయిస్ట్ శాదరక్క

sharadakka

పోలీసుల ఎదుట లొంగిపోనున్న మావోయిస్ట్ శాదరక్క

ఆర్.బి.ఎం హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీ నేత జజ్జరి సమ్మక్క అలియాస్‌ శారదక్క పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు సిద్దమవుతున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ద్వారా ఆమె లొంగిపోయేందుకు యత్నిస్తున్నారు. అనారోగ్య సమస్యల వల్ల శాదర లొంగిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు డీజీపీ మహేందర్‌రెడ్డి సమక్షంలో శాదర జనజీవన స్రవంతితో కలుస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఆమె లొంగిపోయేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. శారద 1990లో దళంలో చేరారు. 2015లో చర్ల-వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శిగా, 2016లో దుమ్ముగూడెం-చింతూరు ఏరియా కమిటీ కార్యదర్శిగా శారదక్క పదవులు చేపట్టారు. 2019లో ఈస్ట్‌ గోదావరి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డివిజన్‌ కమిటీ మెంబర్‌ (డీసీఎం)గా పనిచేశారు. ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని దండకార్యణంలో కరోనాతో భర్త హరిభూషణ్‌ మృతి చెందిన తర్వాత శారదక్క కూడ కొవిడ్‌ బారినపడి కోలుకుంది. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని ఆమె.. మనోవేదనకు గురై అనారోగ్య పాలవడంతో పార్టీ ఆదేశానుసారం జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published.