ఈడీ అధికారులు ఏర్పాటు చేసిన భోజనాన్ని నిరాకరించిన రకుల్‌

ఈడీ అధికారులు ఏర్పాటు చేసిన భోజనాన్ని నిరాకరించిన రకుల్‌

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్‌: టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఈడీ విచారణ ముగిసింది. 7 గంటల పాటు ఈడీ అధికారులు ఆమెను సుదీర్ఘంగా విచారించారు. రకుల్ నుంచి 30 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే బ్యాంక్ లావాదేవీలపై కూడా అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. మూడు బ్యాంక్ అకౌంట్లపై రకుల్ నుండి అధికారులు క్లారిటీ తీసుకున్నారని చెబుతున్నారు. నవదీప్‌, కెల్విన్‌, రకుల్‌ మధ్య లావాదేవీలపై ఈడీ విచారించింది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ బ్యాంక్‌ అకౌంట్లను ఈడీ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. కెల్విన్‌కు రకుల్‌ప్రీత్‌ సింగ్‌ చాలా సార్లు డబ్బులు పంపినట్లు ప్రచారం జరుగుతోంది.

ఆడిటర్‌తో పాటు రకుల్‌ప్రీత్‌ సింగ్‌ను కలిపి ఈడీ అధికారులు విచారించారు. రియా చక్రవర్తితో ఫ్రెండ్షిప్‌పై విచారణలో ఈడీ ప్రశ్నించినట్లు చెబుతున్నారు. ఈ నెల 13న ఎఫ్‌ క్లబ్ మేనేజర్, నవదీప్ విచారణ తరువాత రకుల్ వ్యవహారంపై ఈడీ క్లారిటీకి రానుంది. అయితే ఈడీ అధికారులు ఏర్పాటు చేసిన భోజనాన్ని రకుల్‌ నిరాకరించింది. తన నివాసం నుంచి ఆమె భోజనం తెప్పించుకున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ సెక్షన్ 2, 3 ప్రకారం రకుల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆడిటర్లతో సహా ఈడీ విచారణకు రకుల్ ప్రీత్‌సింగ్ హాజరైంది. డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్, ఛార్మిలను ఈడీ ప్రశ్నించింది.

Leave a Reply

Your email address will not be published.