హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..?

హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..?

ఆర్.బి.ఎం డెస్క్: హుజరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా అతి త్వరలోనే ప్రకటిస్తారని సమాచారం. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు హామీలు ఇస్తూ ప్రచారంలో పాల్గొంటుంది.హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పటికే దళితుల కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది.ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ టిఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ ప్రచారంలో సాగిస్తున్నారు.

హుజరాబాద్ ఉప ఎన్నికల బరిలో బి ఎస్ పి పోటీ చేయాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఆర్ ఎస్ కుమార్ కు పలువురు బీఎస్పీ నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్న ట్లు సమాచారం. హుజరాబాద్ ఉప ఎన్నికల బరిలో బి ఎస్ పి పోటీ చేయాలా వద్దా అనేది ఈ నెల 26న వెలువడే అవకాశం ఉంది.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో పోటీకి దిగితే మరింత ఆసక్తికరంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.