గోషామహాల్‌కు ఉప ఎన్నిక తప్పదా?
ఆర్.బి.ఎం హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఎంఐఎం లేఖ రాసింది. ఇప్పటికే పార్టీ నుంచి ఎల్పీ పదవి నుంచి బీజేపీ సస్సెన్షన్ వేటు వేసింది. ఇప్పుడు స్పీకర్ నిర్ణయం ఉత్కంఠ నెలకొంది. రాజాసింగ్‌పై అనర్హత వేటు పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే గోషామహల్‌కు ఉప ఎన్నిక తప్పదని అంటున్నారు. మహ్మద్ ప్రవక్తపై, ఇస్లాం మతంపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ముస్లింలు ఆందోళనకు దిగారు. పోలీసులు ఆయన అరెస్టులో నిబంధనలు పాటించలేదంటూ రాజాసింగ్ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో కోర్టుఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నిరసనల సెగ ఢిల్లీ దాకా తాకడంతో రాజాసింగ్‌ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించడమే కాక సస్పెండ్ చేస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆయనను ఆదేశించింది. గతంలో బీజేపీ నేత నూపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఆమె చేసిన వ్యాఖ్యలతో కేంద్ర ప్రభుత్వానికి విదేశాల నుంచి దౌత్యపరమైన సమస్యలు వచ్చాయి. దీంతో నుపుర్ శర్మను బీజేపీ సస్పెండ్ చేసింది.
అలజడి సృష్టించడం వల్ల రాజాసింగ్‌పై ఇప్పటివరకు మొత్తం 42 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో అత్యధికంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు సంబంధించినవే కావడం గమనార్హం. తెలంగాణతో పాటు యూపీ, కర్ణాటకలోనూ కేసులు నమోదు చేశారు. గతంలో టీడీపీ బీజేపీ పొత్తులో టీడీపీ అభ్యర్థిగా మంగళహాట్ నుంచి పోటీ చేసి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. 2014, 2018లో మంగళ్‌హాట్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కావడ గమనార్హం. దీంతో బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారనే ఫిర్యాదులతో రాజాసింగ్ ఫేస్‌బుక్ అకౌంట్‌ను రద్దు చేశారు.