మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే

మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే

ఆర్.బి.ఎం వికారాబాద్: గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో పురాతన (మట్టిగోడల) ఇండ్లలో, భవనాలలో నివాసం ఉండే వారు, జాగ్రత్తగా ఉండాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ నియోజకవర్గ ప్రజలకు సూచించారు.

వర్షాల కారణంగా వాగులు పొంగి పొర్లుతున్నాయి, చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయని ఇలాంటి పరిస్థితుల్లో చేపలు పట్టడానికోసం చెరువుల, వాగుల వద్దకు వెళ్ళొదంటూ ఎమ్మెల్యే సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకి వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులు వ్యవసాయ కూలిలు చెట్ల కింద ఆగితే పిడుగు పాటుకు గురయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే అన్నారు.

వర్షాల ప్రభావంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, కాబట్టి ఇంటిపరిసరల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు.రానున్న 48 గంటలు రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం వల్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అనవసరంగా బయటికి వెళ్ళొదంటూ వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.