షర్మిలకు దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి..

షర్మిలకు దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైఎస్ షర్మిలకు దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చారు.కొత్త కొత్తగా పుట్టుకొస్తున్న NGO ఆర్గనైజేషన్ గురుంచి నేను మాట్లాడాను రాజకీయ నాయకులు ఎవరు మాట్లాడిన తప్పకుండ స్పందిస్తా అంటూ షర్మిల పార్టీపై రేవంత్ రెడ్డి స్పందించారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కూతురిగా షర్మిల పై తమకు పార్టీకి అభిమానం ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. షర్మిల దుఃఖంలో ఉండి తనకు తోచినవి మాట్లాడుతోందని షర్మిల మాటలు పట్టించుకోవాల్సిన అవ్సరం తమకు లేదని రేవంత్ రెడ్డి అన్నారు. కుటుంబంలో గొడవలొస్తే షర్మిల ప్రజలపై పడడం ఏంటి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు . తన అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వ్యక్తిగతంగా ఉన్న గొడవలను షర్మిల ప్రజల పై చూపిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. అత్త మీద ఉన్న కోపం దుత్త మీద చూపినట్టు తన అన్న జగన్ పై ఉన్న కోపం ఇలా చూపించడం సరైన చర్య కాదని రేవంత్ రెడ్డి అన్నారు.ఈ క్రమంలో షర్మిల ఏమి మాట్లాడిన ఎవరు పట్టించుకోవద్దని తానైతే ఆమెను లెక్కనే చేయడం లేదని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.