బీజేపీకి కీలక నేత భారీ షాక్…. రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి

బీజేపీకి కీలక నేత భారీ షాక్…. రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి

ఆర్.బి.ఎం హైదరాబాద్: బీజేపీకి ఆ పార్టీ కీలక నేత భారీ షాకిచ్చారు. అంతేకాదు తాను బీజేపీని వదలి కాంగ్రెస్‌లో చేరతున్నట్లు ప్రకటించి.. ఆ పార్టీలో కలకలం రేపారు. బీజేపీ సీనియర్‌ నేత కొలన్‌ హన్మంత్‌రెడ్డి ఆపార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీలో తనకు, కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడం లేదని, పార్టీలో అవమానాలు జరుగుతున్నాయని తెలిపారు. తాను 2019 నుంచి బీజేపీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించినానని, కొందరు వ్యక్తులు తనను, తమ కార్యకర్తలను నిత్యం అనుమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన అనుచరులతో కలిసి ఈ నెల 17న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఆయన బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్‌ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని తెలిపారు. ఏదో ఒక రోజు టీఆర్‌ఎస్ బీజేపీలో చేరడం ఖాయమని హన్మంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీకి హన్మంత్‌రెడ్డి రాజీనామా చేస్తానని చెప్పడం ఆ పార్టీకి నష్టమేనని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.