కాంగ్రెస్ వైపు టీఆర్ఎస్ కీలక నేత తీగల కృష్ణారెడ్డి..!

కాంగ్రెస్ వైపు టీఆర్ఎస్ కీలక నేత తీగల కృష్ణారెడ్డి..!

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మాయమైపోతుంది అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి నూతన ఉత్తేజాన్ని నింపడంతో పాటు ప్రజా సమస్యలపై పోరాటానికి బాటలు వేస్తున్నారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు.ఇతర పార్టీలోని కీలక నేతలను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తూ అధికార పార్టీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇటీవల జరిగిన సభలో రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు జరిగాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పనిచేస్తున్నారు.

అయితే తాజాగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచేందుకు టీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేత కాంగ్రెస్ లోకి వస్తున్నారన్న వార్తలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం లో మంచి పట్టు ఉన్న నాయకుడు తీగల కృష్ణారెడ్డి కొద్ది రోజుల క్రిందట టి పి సి సి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కలవడం ద్వారా రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ తెరమీదికి వచ్చింది.

తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ గూటికి వస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీగల కృష్ణారెడ్డి ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తే ఆయన పార్టీలకు వస్తారా రారా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనున్న టు సమాచారం.

తీగల కృష్ణారెడ్డి అధికార పార్టీ టిఆర్ఎస్ లో ఉన్నప్పటికీ ఆయన అసంతృప్తితో ఉన్నట్లు టాక్.ఈ క్రమంలోనే తీగల కృష్ణా రెడ్డి తన అనుచర యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థిగా మహేశ్వరం నుండి పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి కాలక్రమేణా టిఆర్ఎస్ పార్టీలో చేరిన ఆమెకు క్యాబినెట్లో చోటుదక్కడం వల్ల ఆయన తీవ్రమైన ఆవేదనకు గురయ్యారు అని పార్టీలో కూడా ఆయన తగిన గుర్తింపు ఇవ్వడంలేదని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ఆ సందర్భంలోనే తీగల కృష్ణారెడ్డి పార్టీ మారుతారని చర్చలు చాలా వినిపించాయి.

ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీతో తనకు ఎలాంటి ఉపయోగం లేదని పార్టీ తనను కావాలనే పక్కన పెడుతోందని తీగల కృష్ణారెడ్డి కార్యకర్తలతో వాపోతున్నారని టాక్ బాగా వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తీగల కృష్ణారెడ్డి పార్టీ మారడమే ఉత్తమమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం నుండి పోటీ చేయాలంటే పార్టీ మారక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఎందుకంటే మహేశ్వరి నుండి సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారు.అందువల్ల తీగల కృష్ణారెడ్డి పార్టీ మారడం అవసరం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.