ముత్యాలమ్మ ఎల్లమ్మకి ముక్కుపుడక,కిరీటాన్ని సమర్పించిన ఉప సభాపతి పద్మారావు గౌడ్

ముత్యాలమ్మ ఎల్లమ్మకి ముక్కుపుడక,కిరీటాన్ని సమర్పించిన ఉప సభాపతి పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ శుక్రవారం అలుగడ్డబావి ముత్యాలమ్మ ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శిన అనంతరం అయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్ శ్రీమతి రాసురి సునీత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. అమ్మవారికి బంగారు ముక్కు పుడక, పట్టు వస్త్రాలు, వెండి కిరీటాన్ని పద్మారావు గౌడ్ సమర్పించారు. ఉప సభ పతి పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ఈ విపత్కర పరిస్థితుల్లో యావత్ మానవాళిని కాపాడాలని కరోనా మహమ్మారిని అంతమొందించాలని ప్రజలు దాని బారిన పడకుండా చూడాలని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్ధించానని ఉపసభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస యువ నేతలు తీగుళ్ల కిశోర్ కుమార్, తీగుళ్ల రమేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.