స్వామి గౌడ్ సంచలన వ్యాఖ్యలు..
- ప్రస్తుతం దేశంలో కుల రక్కసి తన వికృత రూపాన్ని ప్రదర్శస్తూ బడుగుబలహీన వర్గాలకు అన్యాయం చేస్తోంది: స్వామి గౌడ్
- పార్టీలలో కొన్ని కులాలదే పై చేయి:స్వామి గౌడ్
- నారాయణ గురు జయంతి వేడుకలో స్వామి గౌడ్ సంచలన నిజాలు
- సర్వాయి పాపన్న జయంతి వేడుకలో ఎక్కడ కనిపించని స్వామి గౌడ్
హైదరాబాద్: హైదరాబాద్ లోని హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నారాయణ గురు జయంతి వేడుకలో టీఆర్ఎస్ నాయకలు మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ పాల్గొన్ని నివాళులు అర్పించారు. ఈ క్రమంలో స్వామి గౌడ్ రాజకీయాల గురుంచి మాట్లాడుతూ స్వల్ప ఆవేధనకు గురైయ్యారు. దేశ రాజకియాల్లో ప్రస్తుతం కొన్ని కులాలకు చేందిన కొంత మందే పరిపాలన ప్రజస్వామ్యాని నడిపిస్తున్నారని స్వామి గౌడ్ అన్నారు.
వందేళ్ల క్రితం ఏర్పడ్డ కుల రక్కసి పునదులే ఇప్పటికి పరిపాలనను కొనసాగించడం బలహిన వర్గాలపై జరుగుతున్న దాడిగా అయన పేర్కోన్నారు. పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు లేకుండా పోతోందని అధికారం కొంత మందికే పరిమితం కావడం వల్ల నారాయణ గురు స్పూర్తితో అన్ని వర్గాల ప్రజలు ఐక్యం కావాలని అయన కోరారు.
సర్వాయి పాపన్న జయంతి వేడుకలో ఎక్కడ కనిపించని స్వామి గౌడ్
తెలంగాణ మలిదశ ఉద్యమంలో స్వామి గౌడ్ తనదైనశైలీలో ఉద్యమంలో పాల్గొన్నారు. లాటీలకు తూటలకు ఎదురోడ్డి నిలబడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఎంత అవసరమో దాని పై ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమ సారధి కేసీఆర్ గారికి,కేటీఆర్,ఈటేల,హరిష్ రావు స్వామి గౌడ్ కు ఎంతో సన్నిహితులు.
ఎంతో మంది కృషి, బలీదానాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి రాష్ట్రం ప్రభుత్వంలో పదవులు దక్కలేదు. ఎంతో మంది ఉద్యమ కారులు నిరుత్సహంతో ఉండపోయారు. కొందరికి మాత్రమే పదవులు దక్కాయి. రాష్ట్రం ఏర్పడిన కొద్ది రోజులకే ప్రభుత్వంపై ముసలం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాటుపడ్డ వారికి కాకుండా ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి పదవులు దక్కాయి. తెలంగాణను అడ్డుకున్నా వారే నేడు పరిపాలనా ప్రజస్వామ్యాన్ని నడిపిస్తున్నారు.
తెలంగాణ బహుజన విప్లవకారుడు సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల్లో ప్రతి సారి ముందుడి కార్యక్రమం చేసే స్వామి గౌడ్ మొన్న జరిగిన పాపన్న జయంతి వేడుకలో ఎక్కడ కనిపించలేడు. స్వామి గౌడ్ ను ప్రభుత్వం ఎందుకు దూరం పేడుతోందని ప్రజల్లో అలోచనలు మొదలైయ్యాయి. స్వామి గౌడ్ పాపన్న జయంతి వేడుకలోనే కాకుండా ఏ ఇతర పార్టీ కి సంబంధించిన కార్యక్రమాల్లో కనిపించకుండాపోయారు.