అన్న వితరణ కార్యక్రమాన్ని అడ్డుకోవడం దారుణం.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన సీతక్క

అన్న వితరణ కార్యక్రమాన్ని అడ్డుకోవడం దారుణం.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన సీతక్క

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ఈ విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు అన్న వితరణ కార్యక్రమాలు చేస్తున్నా వారిని ప్రభుత్వం అడ్డుకొని రాక్షసంగా వ్యవహరిస్తోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు రేవంత్ రెడ్డి గాంధీ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన అన్న వితరణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడాన్ని ఆమె తీవ్రంగా కండించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల గురుంచి పట్టించుకోరు. పేదలకు సహాయం చేదాం అని ముందుకు వచ్చిన వాళ్ళని చేయనీయరు అని ఆమె అన్నారు. మీకు కరోనా భయం ఉంటె ఇంట్లోనే ముసుగు వేసుకొని పడుకోండి అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కడుపు నిప్పాలని అనుకోవడం తప్పా అని ఆమె ప్రశ్నించింది. కాగా ఈ రోజు సీతక్క గాంధీ ఆస్పత్రికి చేరుకొని అక్కడ పేద ప్రజలకు అన్న వితరణ కార్యక్రమం చేపట్టింది. ప్రతి హాస్పిటల్ దగ్గర ఉచిత భోజనం సహాయ కార్యక్రమం ప్రభుత్వమే ప్రారంభించాలి పేద ప్రజలను ఆకలి బాధలు నుంచి ఆదుకోవాలి అని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published.