ఉన్నపలంగా లాక్ డౌన్ ప్రకటిస్తే ఎలా.. తెలంగాణ హైకోర్టు
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నపలంగా లాక్ డౌన్ విధిస్తు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు సంచలన ప్రకటన చేసింది. ఇప్పటికి ఇప్పుడు లాక్ డౌన్ అంశం తెరపైకి తెస్తే ఇతర రాష్ట్రాల ప్రజల పరిస్థితి ఏంటి అని హై కోర్టు ప్రశ్నించింది. పక్క రాష్ట్రాల ప్రజలు తమ స్వస్థలాలకు ఇంత తక్కువ సమయంలో ఎలా వెళతారని ప్రభుత్వాని కోర్టు ప్రశ్నిచింది. గతంలో విధించిన లాక్ డౌన్ వల్ల వలస కూలీలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని కోర్టు తెలిపింది. గతంలో జరిగినట్టు ఇప్పుడు జరగకూడదని కోర్టు అభిప్రాయపడింది. పక్క రాష్ట్రాలకు వెళ్లేవారికోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్స్ నుండి రవాణా సౌకర్యానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలనీ కోర్టు ప్రభుత్వాని కోరింది.