రాష్ట్రవ్యాప్తంగా కిటకిటలాడుతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు

రాష్ట్రవ్యాప్తంగా కిటకిటలాడుతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు

ఆర్.బి.ఎం  హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. భూముల ధరల పెంపు ప్రతిపాదనలతో ముందుగానే రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల సందడి నెలకొంది. ఉప్పల్, వనస్థలిపురం, బీబీనగర్‌ ఆఫీస్‌లో 150 నుంచి 200 వందల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రాత్రి 10 గంటలకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు  చేస్తున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి ప్రభుత్వం భూముల ధరలు పెంచుతోంది. కనిష్టంగా 25 శాతం…గరిష్ఠంగా 50 శాతం వరకు భూముల ధరల పెంచే అవకాశం ఉంది. వ్యవసాయ భూములకు 50 శాతం, ఖాళీ స్థలాలను 35 శాతం.. అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్స్‌కి 25 శాతం ధరలు పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. భూముల ధరలు పెంపు వాయిదా వేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. భూముల ధరలు సవరించి 7 నెలలు కాకముందే మళ్ళీ పెంపు ఒక భారం మోపుతున్నారని క్రెడాయ్‌ అంటోంది. కనీసం ఇంకో 6 నెలలు సమయం ఇవ్వాలని, పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని క్రెడాయ్‌ కోరింది. భూముల ధరలు పెంపు ప్రణాళిక ప్రకారం చేయాలని, కొవిడ్‌ మూడో దశ ఎఫెక్ట్‌తో మార్కెట్ మందకొడిగా ఉందని తెలిపింది. రిజిస్ట్రేషన్, నాలా చార్జీలు తగ్గించాలని కెడాయ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది.

Leave a Reply

Your email address will not be published.