ఈటల రాజేందర్ ను అరెస్ట్ చేసిన తెల్లవారి నుండే లాక్ డౌన్?
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అతి వేగంగా మారిపోయాయి. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర సంచలం సృష్టించాయి. భూ కబ్జా ఆరోపణలు నిర్దారణ అయితే ఈటల పై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతున్నటు తెలుస్తోంది. ఆరోపణలు రుజువైన వెంటనే ఈటల రాజేందర్ ను అరెస్ట్ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటు సమాచారం.ఈటల రాజేందర్ ను అరెస్టు చేస్తే అయన అనుచరుల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో వారు ధర్నాలు, రాస్తారోకోలు చేసే అవకాశం ఉంది. కాగా మరో వైపు బీసీ సంఘాలు పలు కుల సంఘాలు స్వచ్చందంగా ఈటల రాజేందర్ కు మద్దతు ప్రకటిస్తాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ బలం మరింత పుంజుకోనుంది. ఈ మేరకు రాష్ట్రంలో టీఆరెస్ పార్టీకి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఈటల రాజేందర్ ను అరెస్ట్ చేసిన మరుసటి రోజు నుండి రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోతారనే వార్తలు వినిపిస్తున్నాయి.