కరోనాను నియంత్రించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం: పద్మారావు గౌడ్, డిప్యూటీ స్పీకర్

కరోనాను నియంత్రించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం: పద్మారావు గౌడ్, డిప్యూటీ స్పీకర్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్రంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని ప్రభుత్వానికి ప్రజలు కూడా సహకరించి తగు జాగ్రత్తలు పాటించాలని ఉప సభాపతి టి.పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పరిధిలో జి.ఎచ్.ఎం.సి ఏర్పాటు చేసిన సోడియం హిపో క్లోరైడ్ ద్రావకం పిచకారీ వాహనాన్ని తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదివారం సితాఫలమండీలోని తమ క్యాంపు కార్యాలయం వద్ద ప్రారంభించారు.

మీడియాతో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల ప్రజల ఇబ్బందులు తమను ఎంతగానో కదిలించి వేశాయని, ఆక్సిజన్ సిలిండర్ ల పంపిణీ, అత్యవసర సందర్భాల్లో అందించే రిమేడిస్విర్ ఇంజక్షన్ అందించేందుకు ఏర్పాట్లు వంటి వివిధ చర్యలు తీసుకున్నామని అయన అన్నారు . జి.ఎచ్.ఎం.సి అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, పరిసరాల పరిశుభ్రత కు అధిక ప్రాముక్యత కల్పించాలని అయన ఆదేశించారు. ఫీవర్ సర్వే ను అన్ని కాలనీలు, బస్తీల్లో నిర్వహించేందుకు సికింద్రాబాద్ పరిధిలో 6 ప్రత్యెక బృందాలను ఏర్పాటు చేశామని, ప్రజలకు జాగ్రత్తల పై అవగాహన కల్పించాలని అయన కోరారు. సికింద్రాబాద్ లో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని అత్యవసరం ఉంటె తప్ప ప్రజలు బయటికి రావద్దని ఒకవేళ వచ్చిన కచ్చితంగా మాస్క్ ధరించి బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటిస్తూ కరోనా వ్యాప్తి నుండి తమను తాము రక్షించుకొని ఇతరులను కూడా రక్షించాలని అయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమాల్లో జి.ఎచ్.ఎం.సి డిప్యూటీ ఈ ఈ శ్రీమతి గీతా కుమారి, కర్పరేటర్ కుమారి సామల హేమ, తెరాస నేతల, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.