ఆర్.బి.ఎం తరుపున డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అయన రాయకీయ, వ్యక్తిగత విషయాలు మీకోసం..

ఆర్.బి.ఎం తరుపున డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అయన రాయకీయ, వ్యక్తిగత విషయాలు మీకోసం..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: టి.పద్మారావు గౌడ్ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. ఈయనను బాగా ఇష్టపడేవారు పజ్జన్న అని పిలుస్తుంటారు. పద్మారావు గౌడ్ ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్న కూడా అయన మాత్రం ఒక మాములు వ్యక్తిగా ప్రజలతో మమేకమైపోతాడు. తన నియోజకవర్గంలోని ప్రజలని తన కుటుంబ సభ్యులుగా బంధువులుగా భవిస్తూ వారిలో ఒక్కరిలా  కలిసి ఉంటారు. రాజకీయ నాయకుడిగా అయన ఎప్పుడు ఉండడు ఒక మాములు మనిషిగానే ఉంటారు. అందరిలా ఆయనకు ప్రతేక్యమైన ఆఫీసులు చాంబర్లు ఉండవ్ అయన ఆఫీస్ ప్రజల మధ్యే ఎలాంటి సమస్య అయినా ప్రజల మధ్యలో ఉండి పరిష్కరిస్తారు పజ్జన్న. తెలంగాణలో ఈయనను మాస్ లీడర్ గా కూడా సంబోధిస్తారు. పద్మారావు గౌడ్ గారు ఈ స్థాయిలో ఉండి కూడా ఓ సాధారణ వ్యక్తిలా టీ షాప్ ల వద్ద టీ తాగుతూ బస్తి వాసులతో సరదాగా గడుపుతారు.  పద్మారావు గౌడ్ 1954, ఏప్రిల్ 7న సికింద్రాబాద్ లో జన్మించాడు. సికింద్రాబాద్ ఎస్పీ రోడ్ లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు.పద్మారావు గౌడ్ కి స్వరూప రాణితో వివాహం జరిగింది. పద్మారావు గౌడ్ గారికి నలుగురు కుమారులు కిషోర్ గౌడ్, కిరణ్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ జీవితం:
టి.పద్మారావు గౌడ్ గారు చదువు అనంతరం అయన అడుగులు రాజకీయాల వైపు పడ్డాయి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి మున్సిపల్ కౌన్సిలర్ గా  అయన ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితిలో 2001లో పద్మారావు చేరారు. పజ్జన్న మొదటిసారిగా 2004లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి 2009లో ఎమ్మెల్యేగా పోటిచేసి కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలుపు తప్ప ఓటమి ఎరగలేదు. హైట్రిక్ ఎమ్మెల్యేగా పేరు సంపాదించారు పద్మారావు గౌడ్ గారు.

ప్రత్యేక్య రాష్ట్ర సాధనలో పద్మారావు గౌడ్ పాత్ర కీలకంగా ఉండేది. కెసిఆర్ నమ్మిన అతి కొద్దీ మంది వ్యక్తుల్లో పద్మారావు ఒక్కరు. పద్మారావు గౌడ్ కు కెసిఆర్ కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కెసిఆర్ కుటుంబ సభ్యులు పద్మారావుని తమలో ఒక్కడిలా చూస్తారు.

ప్రత్యేక్య రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ తో పాటు పజ్జన్న కూడా అలుపెరగని పోరాటం చేశారు. ప్రత్యేక్య రాష్ట్రం ఏర్పడిన తరవాత తెలంగాణ ప్రభుత్వం కేబినెట్లో తొలి ఎక్సైజ్,యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు. 2018 లో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో మరోసారి సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. తెలంగాణ ప్రభుత్వంలో తొలిసారి మినిస్టర్ గా బాధ్యతలు చేప్పట్టగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పద్మారావు ను డిప్యూటీ స్పీకర్ గా నియమించారు.

 

కాగా ఈ రోజు పద్మారావు గౌడ్ గారి పుట్టిన రోజు (ఏప్రిల్ 7) వారికీ మా ఆర్.బి.ఎం ఛానల్ తరుపున హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు ఇంకా ఉన్నతమైన పదవులు చెప్పట్టాలని ఆశిస్తూ వారికీ మరోసారి పుట్టినరోజు శుభకాంశాలు.

Leave a Reply

Your email address will not be published.