ఉచిత మంచి నీటి సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఉప సభాపతి పద్మారావు గౌడ్

ఉచిత మంచి నీటి సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఉప సభాపతి పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: జంట నగరాల ప్రజలు ఉచిత మంచి నీటి సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. అధికార యంత్రాంగం సైతం ప్రజలకు మంచి నీటిపై అవగాహన కల్పించాలని పద్మారావు గౌడ్ సూచించారు. నెలకు 20 వేలలీటర్ల వరకు నీటిని పొందేవారికి కల్పించే సదుపాయం పై మంగళవారం సీతాఫలమండీ క్యాంపు కార్యాలయంలో పద్మారావు గౌడ్ ఆధ్వర్యంలో ఓ అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ప్రచురించిన కరపత్రాన్ని శ్రీ పద్మారావు గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఆగస్టు 15 తేదీ వరకు ఆధార్ తో నల్లా కనెక్షన్లు అనుసంధానం చేసుకోవాలని పద్మారావు గౌడ్ సూచించారు. డిసెంబరు 2020 నుంచి ఆగస్టు వరకు 20 వేల లీటర్ల 9 నెలల బిల్లుల మినహాయింపు లభిస్తుందని అయన వివరించారు. ఆగస్టు 15 తేదీ తరువాత ఆధార్ అనుసంధానం , మీటర్లు ఏర్పాటు చేసుకున్న వారికీ అనుసంధానం తేదీ నుంచి మినహాయింపు వర్తిస్తుందని అయన పేర్కొన్నారు. అన్ని కాలనీలు, బస్తీల్లో అధికారుల బృందాలు పర్యటించాలని పద్మారావు గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కుమారి సామల హేమ, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, తెరాస యువ నేతలు తీగుళ్ల కిషోర్ కుమార్, తీగుళ్ల రామేశ్వర్ గౌడ్ జలమండలి సి జీ ఏం శ్రీ ప్రభు, జీ ఏం శ్రీ రమణా రెడ్డి, డీ జీ ఏం లు శ్రీ కృష్ణ, డేవిడ్ రాజు, మేనేజర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.