మహిళా సంఘాలకు ప్రోత్సాహకాలు అందించాలి : ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్

మహిళా సంఘాలకు ప్రోత్సాహకాలు అందించాలి : ఉప సభాపతి  తీగుళ్ల పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో మహిళా సంఘాల కార్యకలాపాలు రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో ఉన్నాయని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. మహిళా సంఘాలకు సకాలంలో రుణాలను అందించడంతో పాటు వివిధ ప్రోత్సాహకాలు అందించాలని పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ జీ.హెచ్.ఏం.సి పరిధిలో యూ సి డీ కొత్త ప్రాజెక్ట్ అధికారులతో మంగళవారం సీతాఫలమండి క్యాంపు కార్యాలయంలో పద్మారావు గౌడ్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ అన్ని మునిసిపల్ డివిజన్ల పరిధిల్లో మహిళా పొదుపు సంఘాలకు ప్రోత్సాహకాలు అందించాలని పద్మారావు గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ మోహన్ రెడ్డి, సర్కిల్ ప్రాజెక్ట్ అధికారి బలరాం తో పాటు సీతాఫలమండీ, బౌద్ధనగర్, మెట్టుగూడ, అడ్డగుట్ట, తార్నాక డివిజన్ల ఆర్గనైజర్లు, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, తెరాస యువ నేతలు తీగుళ్ల కిషోర్ కుమార్, తీగుళ్ల రామేశ్వర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.