మెగాస్టార్ చిరంజీవి ఇంట వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటున్న నాలుగుతరాల ఆడవాళ్లు..ఫోటో వైరల్.

మెగాస్టార్ చిరంజీవి ఇంట వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటున్న నాలుగుతరాల ఆడవాళ్లు…ఫోటో వైరల్
శ్రావణమాసం వచ్చిందంటే చాలు ప్రతి తెలుగువారి ఇంట్లో పూజలు పునస్కారాలు మొదలవుతాయి ఇక ఆలయాలు అయితే భక్తులతో నిండి పోతాయి. శ్రావణ మాసంలో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ భక్తిశ్రద్ధలతో దేవుని పూజిస్తుంటారు, ఉపవాసాలు వ్రతాలు చేస్తుంటారు. శ్రావణ మాసంలో శుక్రవారం ఆడవారికి ప్రత్యేకమైన రోజు. ప్రతి శుక్రవారం కొందరు ఆడవాళ్ళు ఉపవాసాలు ఉంటూ అమ్మవారిని పూజిస్తారు. అయితే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఒక శుక్రవారం ప్రత్యేకమైనది ఇది శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వస్తుంది, ఈ శుక్రవారాన్ని ఆడవాళ్ళు వరలక్ష్మీ వ్రతంగా జరుపుకుంటారు. వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారిని పూజిస్తే అష్ట లక్ష్మి పూజలతో సమానం అని నమ్ముతారు.

ఈ శ్రావణ మాసం లో నిన్ను ప్రతి తెలుగువారి ఇంట వరలక్ష్మీ వ్రతం జరుపుకున్నారు అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతుంది. అందులో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా నాలుగు తరాలకు చెందిన ఆడవాళ్ళు వ్రతం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి అమ్మగారు అంజనా దేవి, తన సతీమణి సురేఖ, కోడలు ఉపాసన మరియు తన మనవరాలు నివృతి వ్రతం ఆచరిస్తున్న ట్లు ఫోటోలో కనిపిస్తుంది. వీరందరూ అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా అలంకరించుకున్నారు. శ్రీజ కూతురు నివృత్తి అచ్చమైన తెలుగు అమ్మాయిలా చీర కట్టుకొని చిరునవ్వుతో అందంగా కనిపిస్తుంది.
ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలోని నాలుగు తరాల వారు వ్రతం చేయడం ముచ్చటగా ఉందని హాట్ స్టార్ చిరంజీవి అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.