చెత్త రహిత ప్రాంతంగా సికింద్రాబాద్: ఉప సభాపతి పద్మారావు గౌడ్

చెత్త రహిత ప్రాంతంగా సికింద్రాబాద్:ఉప సభాపతి పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ప్రతి కాలనీలు, బస్తీల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సమకూర్చే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయాలనీ ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ సూచించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫలమండి క్యాంపు కార్యాలయం వద్ద జీ.హెచ్.ఏం.సి నూతన శానిటేషన్ వాహనాలను పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా పద్మారావు గౌడ్ మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలం కావడంతో పలు రకాల రోగాలు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉండటం వల్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పద్మారావు గౌడ్ సూచించారు.ఈ క్రమంలో అదనంగా సిబ్బంది, వాహనాలను మునిసిపల్ అధికార యంత్రాంగం సమకూర్చుకోవాలని పద్మారావు గౌడ్ తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గంను చెత్త రహిత ప్రాంతంగా తీర్చి దిద్దాలని పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. జీ.హెచ్.ఏం.సి ఉప కమీషనర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ దశల వారీగా చెత్తను తరలించేందుకు వాహనాల సంఖ్యను పెంచుకుంటున్నామని ఉప కమీషనర్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో  కార్పొరేటర్ కుమారి సామల హేమ,లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, కంది శైలజ, అదేవిదంగా తెరాస యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, అధికారులు డాక్టర్ రవీందర్ గౌడ్, గీత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.