ఏఎస్ రావు నాగర్‌లో గుహా మోటార్స్ షో రూమ్‌ను ప్రారంభించిన ఉప సభాపతి పద్మారావు గౌడ్
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ఉప సభాపతి పద్మారావు గౌడ్ ఈరోజు(శుక్రవారం) ఏఎస్ రావు నాగర్‌లో గుహా మోటార్స్ షో రూమ్‌ను ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. గుహా మోటార్స్ షో రూమ్ నిర్వాహకులు ఉప సభాపతి పద్మారావు గౌడ్ కు ఘనంగా ఆహ్వానం పలికారు.అనంతరం గుహా మోటార్స్ షో రూమ్ నిర్వాహకులు పద్మారావు గౌడ్ ను సన్మానించారు.ఈ క్రమంలో ఉపసభాపతి పద్మారావు గౌడ్ గుహా మోటార్స్ షో రూమ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గుహా మోటార్స్ షో రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్వాహకులు స్వదేశ్ గుహ, శ్రీధర్ అలాగే నాగేశ్వర్ రావు గౌడ్, పాలకుర శ్రీనివాస్ గౌడ్, సునీల్, మల్లికార్జున్, హనుమత్ యాదవ్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.