బండి సంజయ్ పాదయాత్ర దేనికోసం చేస్తున్నారు: మంత్రి కేటీఆర్

బండి సంజయ్ పాదయాత్ర దేనికోసం చేస్తున్నారు: మంత్రి కేటీఆర్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర దేనికోసం చేస్తున్నారో చెప్పాలని మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో ప్రశ్నించారు. వరదలు వచ్చిన సందర్భంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం మిగితా రాష్ట్రాలకు నిధులు మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించింది అని కేటీఆర్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ప్రజలల్లోకి పోవడానికి సిగ్గుగా అనిపించడం లేదా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

డిజిటల్ ఇండియా, సిట్ ఇండియా, మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, ఫిట్ ఇండియా, అన్ని అయిపోయాయి ఇప్పుడు బేచో ఇండియా అనే కార్యక్రమాన్ని బీజేపీ మొదలుపెట్టిందని కేటీఆర్ అన్నారు. నగరంలోని మౌలాళిలో ఇరవైఒక్క ఎకరాల రైల్వే భూములను కేంద్రప్రభుత్వం అమ్మకానికి పెడుతున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలో చేసిన విధంగా తెలంగాలో చేద్దామనుకుంటే ఇక్కడ చూస్తూ ఉరుకోము అని మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published.