తీన్మార్ మల్లన్నను బెదిరించిన మంత్రి మల్లారెడ్డి అనుచరులు..!

తీన్మార్ మల్లన్నను బెదిరించిన మంత్రి మల్లారెడ్డి అనుచరులు..!

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: నగరంలోని తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంలోకి మంత్రి మల్లారెడ్డి అనుచరులు వెళ్ళి బెదిరింపులకు పాల్పడ్డారని తీన్మార్ మల్లన్నక్యూ న్యూస్ వేదికగా వెల్లడించారు.

తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ అక్రమంగా క్యూ న్యూస్ కార్యాలయంలోకి చొరబడి మంత్రి మల్లారెడ్డి అనుచరులు నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు ఇలాంటి బెదిరింపులకు నేను భయపడే వ్యక్తిని కాదని తీన్మార్ మల్లన్న అన్నారు. ఈ క్షణం నుండి మంత్రి మల్లారెడ్డి చేసిన కబ్జాలు అన్ని ఒకొకటి బయటికి తీస్తానని అయన అన్నారు. మంత్రి మల్లారెడ్డి భూకబ్జాలకు సంబంధించిన పలు పేపర్లు తన వద్ద ఉన్నాయని తీన్మార్ మల్లన్న తెలిపారు. మంత్రి మల్లారెడ్డి నిజమైన మంత్రి అయితే వాటికీ సమాధానం చెప్పాలి అని తీన్మార్ మల్లన్న అన్నారు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరాడు.

Leave a Reply

Your email address will not be published.