కేంద్ర నిర్ణయంతో ఇరకాటంలో తెలంగాణ ప్రభుత్వం!

కేంద్ర నిర్ణయంతో ఇరకాటంలో తెలంగాణ ప్రభుత్వం!

ఆర్.బి.ఎం హైదరాబాద్: కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వాన్ని చిక్కులు తెచ్చిపెడుతోంది. దేశంలో ఏ రాష్ట్రం కరోనాను కట్టడి చేయలేకపోయిందని, తెలంగాణలో వైరస్‌ను కట్టడి చేసి అందరికీ ఆదర్శంగా నిలిచామని ప్రభుత్వం బీరాలు పలికింది. అందుకు సాక్ష్యంగా రోజువారి కేసులతో పాటు మరణాలను కూడా తగ్గించి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండాలన్న ఉద్దేశంతో కరోనా మృతుల సంఖ్యను ప్రభుత్వం ఉద్దేశపూర్వ కంగానే తక్కువ చేసి చూపించిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వొచ్చని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎంఏ) సిఫారసు చేసినట్లు బుధవారం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం నివేదించింది. కొవిడ్‌ కట్టడి చర్యలు, ఉపశమన కార్యక్రమాల్లో పాల్గొనగా వైరస్‌ సోకడంతో చనిపోయిన వారి కుటుంబాలకు కూడా ఎక్స్‌గ్రేషియా ఇవ్వొచ్చని పేర్కొంది.

ప్రభుత్వం అధికారికంగా సెప్టెంబర్ 23న వెల్లడించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 3,909 మంది కరోనా మృతులకు 50 వేల చొప్పున సుమారు 19.54 కోట్ల మేరకు ఎసీఆర్ఎఫ్ నిధుల నుంచి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎక్కువగా కరోనాతో చనిపోయిన కేసుల్లో అత్యధికంగా దీర్ఘకాలిక వ్యాధులతోచనిపోయిన వారు ఉన్నారు. ఇలా ఈ రెండేళ్ల వ్యవధిలోదాదాపు నలభై వేల మంది దీర్ఘకాలిక వ్యాధులకు తోడు కరోనాతో చనిపోయారని తెలుస్తోంది. ఇప్పుడు వీళ్లంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా ఆర్థిక సహాయానికి అర్హుల కదా అన్నది తేల్చాల్సింది ఉంది. అయితే ప్రభుత్వం నుండి అధికారికంగా డెత్ సర్టిఫికెట్ పొందిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానం చివరకు రాష్ట్రానికి సరికొత్త చిక్కులను తీసుకొచ్చినట్లయింది. కేంద్ర నిర్ణయంతో తెలంగాణ దిక్కుతోచని స్థితిలో పడింది.

Leave a Reply

Your email address will not be published.