సికింద్రాబాద్ లో సూపర్ స్ప్రేడర్స్ ప్రత్యేక టీకా కేంద్రాన్ని ప్రారంభించిన ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ లో సూపర్ స్ప్రేడర్స్ ప్రత్యేక టీకా కేంద్రాన్ని ప్రారంభించిన ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం డెస్క్ : కరోనా వ్యాప్తి నివారణ చర్యలను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా చేపడుతోందని, ఫ్రంట్ లైన్ వారియర్స్ తో పాటు సూపర్ స్ప్రేడర్స్ గా వ్యవహరిస్తున్న వివిధ వర్గాలకు చెందిన వారికీ ప్రత్యేకంగా వాక్సినేషన్ చేపడుతున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సూపర్ స్ప్రేడర్స్ గా వ్యవహరించే వారికీ ప్రత్యెక టేకా శిబిరాన్ని సితాఫలమండీ లోని ముల్టిపర్పెస్ ఫంక్షన్ హాల్ వద్ద ఏర్పాటు చేయగా, ఈ శిబిరాన్ని శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ శుక్రవారం ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ కరోనా వ్యాధి వల్ల ప్రజా జీవితమే అల్లకల్లోలంగా మరే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటూ కారోన వ్యాప్తిని నివారించేందుకు ప్రయత్నిస్తోందని వివరించారు. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రాధాన్యత కల్పించాల్సి వస్తోందని అన్నారు. నగర వ్యాప్తంగా 3 లక్షల మంది తో సహా సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో కనీసం 15 వేల మంది సూపర్ స్ప్రేడర్స్ కు 10 రోజుల్లో టీకాలు ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు జరుపుతున్నామని శ్రీ పద్మారావు గౌడ్ తెలిపారు. ఈ సూపర్ స్ప్రేడర్స్ వర్గంలో చిరు వ్యాపారాలు, వీధి వ్యాపారాలు, కూరగాయల విక్రేతలు, దుకాణాల నిర్వాహకులు, రేషన్ డీలర్లు, గ్యాస్ డీలర్లు వారి సిబ్బంది మొదలుకొని వివిధ వర్గాల వారికీ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలతా శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, శ్రీమతి రాసురి సునీతా, శ్రీమతి లింగాని లక్ష్మి ప్రసన్న శ్రీనివాస్, శ్రీమతి కంది శైలజ, తెరాస యువ నేత శ్రీ తీగుల్ల రామేశ్వర్ గౌడ్, Ghmc ఉప కమీషనర్ శ్రీ మోహన్ రెడ్డి, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.